close
ట్విటర్‌లో విన్నపాలు.. స్పందించిన సానియా, కవిత

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితలు ట్విటర్‌ ద్వారా తమకు వచ్చిన విన్నపాలకు స్పందించారు. ఇద్దరు చిన్నారులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
* పూలు విక్రయించే చిరు వ్యాపారి 14 ఏళ్ల కుమార్తె హృద్రోగ సమస్యతో బాధపడుతోంది. శస్త్రచికిత్సకు రూ.5 లక్షల మేర ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. చిన్నారి పరిస్థితిని వివరిస్తూ ఓ సంస్థ సానియాను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేసింది. తన కార్యాలయం వారు సంప్రదిస్తారంటూ సానియా బదులిచ్చారు.
* తన బంధువైన రెండేళ్ల చిన్నారి అరుదైన వ్యాధితో బాధపడుతూ బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని.. సాయం చేయాలంటూ సత్తార్‌ అహ్మద్‌ఖాన్‌ అనే వ్యక్తి కవితను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. స్పందించిన కవిత తన కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా ఫోన్‌ నంబరు అందించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.