close
సగం నీటిమట్టానికే మూసీ గేట్ల ఎత్తివేత!

 అధిక నీటి ప్రవాహానికి స్టాప్‌లాగ్‌  గేటు తట్టుకోకపోవడమే కారణం?

ఈనాడు నల్గొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాలో 33 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే మూసీ ప్రాజెక్టు గేట్లు సోమవారం రాత్రి వరకు ఎత్తే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోకముందే క్రస్ట్‌గేట్లు ఎత్తడానికి ఇటీవల బిగించిన స్టాప్‌లాగ్‌ గేటే కారణమని తెలిసింది. మూసీ ప్రాజెక్టులో నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. దీంతో తాత్కాలిక ప్రాతిపాదికన అమర్చిన స్టాప్‌లాగ్‌ గేటు అధిక నీటి ఒత్తిడిని తట్టుకోలేదని..అందుకే నీటిమట్టాన్ని 635 అడుగుల మేర ఉంచి చేసి పైనుంచి వస్తున్న నీటిని గేట్ల ద్వారా దిగువకు విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలు (645 అడుగులు) కాగా ప్రస్తుతం 2.8 టీఎంసీల (635 అడుగులు) నీరు ఉంది. నీటి ఉద్ధృతిని తట్టుకోలేక ఈ నెల 5వ తేదీన ప్రాజెక్టు 5వ నంబరు గేటు కొట్టుకుపోయింది. వృథాగా వెళుతున్న నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడానికి తాత్కాలిక ప్రాతిపదికన స్టాప్‌లాగ్‌ గేటును అమర్చారు. మరోవైపు ఇప్పటికే 5వ నంబరు రెగ్యులేటరీ గేటు కొట్టుకుపోగా...మిగిలిన గేట్లు సైతం ప్రమాదకరంగానే ఉన్నాయి. రెండేళ్ల క్రితమే మరమ్మతులు చేపట్టినా ప్రాజెక్టు సగం నీటిమట్టానికి చేరుకోగానే గేట్ల నుంచి నీరు  లీకవుతోంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.