close
పాడిరైతులకు దీపావళిలోగా రూ.4 ప్రోత్సాహకం: మంత్రి తలసాని

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: పాడిరైతులకు లీటరుపాలపై ఇస్తున్న రూ.4 ప్రోత్సాహకాన్ని దీపావళిలోగా చెల్లిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రకటించారు. విజయ, కరీంనగర్‌, ముల్కనూర్‌, మదర్‌ డెయిరీల రైతులకు బకాయిలున్న రూ.45 కోట్లనూ విడుదల చేస్తామన్నారు. సోమవారమిక్కడ మంత్రి తలసాని.. పశుసంవర్ధక, డెయిరీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో వైద్య సేవలను విస్తరించేందుకు పట్ణణాల్లోని పశువైద్యశాలలను సమీప మండలాలు, గ్రామాలకు తరలించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇకపై పశుసంవర్ధక శాఖలోని ఉద్యోగులకు ప్రతీ నెల సకాలంలో వేతనాలు ఇచ్చేలా చర్యలు చేపడతామన్నారు. 20వ పశుగణనలో గొర్రెల సంఖ్యలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలవడంపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.