close
రామసముద్రం చెరువు

ఇది యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు రామసముద్రం చెరువు. ఐదేళ్లుగా చుక్కనీరు లేకుండా ఎండిపోయి ఉన్న ఈ చెరువు నేడు నిండు కుండలా తొణికిసలాడుతోంది. నెల రోజుల క్రితం ఇక్కడి యువత నీరు లేక ఎండిపోయిన ఈ చెరువులోని కొంత భాగాన్ని చదును చేసుకుని.. పోలీసు కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షలకు సాధన చేశారు. నేడు ఈ చెరువు అలుగు పోస్తోంది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు మూసీ నదిలో చేరి శివారు జిల్లాల్లోని గొలుసుకట్టు చెరువుల్లోకి చేరుతోంది. దీంతో ఆ చెరువులు అలుగు పోస్తూ ఆకట్టుకుంటున్నాయి. మూసీ పరీవాహక ప్రాంతంలోని చాలా కాలువలకు మరమ్మతులు చేస్తే మరిన్ని చెరువులు జలకళను సంతరించుకుంటాయి.

- ఈనాడు, హైదరాబాద్‌

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.