close
అద్దె బస్సుల టెండరుపై స్టేకు నిరాకరణ

ఈనాడు, హైదరాబాద్‌: అద్దె ప్రాతిపదికన 1035 బస్సులు నడపడానికి ఆర్టీసీ జారీ చేసిన టెండరు నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. టెండర్లను నిలిపివేయాలంటూ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికసంఘ్‌ తరఫున ప్రధాన కార్యదర్శి పి.రమేష్‌కుమార్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి టెండర్లపై తదుపరి చర్యలను నిలిపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించారు. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తున్న ప్రజాప్రయోజన వ్యాజ్యానికి జత చేయాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు కార్మిక సంఘ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది టి.సూర్యకరణ్‌రెడ్డి వాదన వినిపించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.