close
పత్తి పరిశ్రమలకు బకాయిలు చెల్లించాలి

 తెలంగాణ కాటన్‌ మిల్లర్స్‌ అండ్‌   ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని పత్తి పరిశ్రమలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు మంజూరైనా చెల్లించడం లేదని తెలంగాణ కాటన్‌ మిల్లర్స్‌ అండ్‌ ట్రేడర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆవేదన వ్యక్తం చేసింది. పత్తి పరిశ్రమలకు దాదాపు రూ.400కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మినేని రవీందర్‌రెడ్డి మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో పరిశ్రమలకు వాడుతున్న విద్యుత్‌లో 50 శాతం మాత్రమే వినియోగించాలని ఆదేశించారని, అది సాధ్యం కాని తరుణంలో వారం రోజుల వినియోగానికి ఒక్కో పరిశ్రమపై రూ.20-30 లక్షలదాకా అదనపు(పీనల్‌) ఛార్జీలు విధించారన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ ఈ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకాల కింద రూ.500కోట్లు ఇవ్వాల్సి ఉండగా 2017లో మంత్రులు ఈటల, కేటీఆర్‌, హరీశ్‌రావులు తమ సంఘంతో సమావేశమై అదనపు ఛార్జీలు రద్దు చేస్తామని చెప్పారన్నారు. ప్రోత్సాహకాల్లో రూ.100కోట్లు విడుదల చేశారని, మిగతావి త్వరలో ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. రూ.400కోట్లు విడుదల చేసినా చెల్లించడంలో జాప్యం చేస్తున్నారని వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే పత్తి పరిశ్రమల్ని నడపలేమన్నారు. దీపావళి లోపు ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని.. లేనిపక్షంలో తర్వాతి కార్యాచరణను ప్రకటిస్తామని వెల్లడించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.