close
ఆర్డీఎస్‌ ఆనకట్ట ఆధునికీకరణకు నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్‌) ఆనకట్టకు మరమ్మతులు చేసేందుకు 3 రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేశాయి. దీనిపై మంగళవారం ప్రత్యేకంగా తుంగభద్ర బోర్డు సమావేశం నిర్వహించారు. బోర్డు ఛైర్మన్‌ డి.రంగారెడ్డి అధ్యక్షతన కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇంజినీర్లు తుంగభద్ర జలాశయంలోని నీటి వినియోగంపై చర్చించారు. ఆర్డీఎస్‌ను తుంగభద్ర బోర్డు పరిధిలోకి చేర్చే అంశంపైనా చర్చ జరిగింది. దీనికి కర్ణాటక ఇంజినీర్లు విముఖత వ్యక్తం చేశారు. ఈ ఆనకట్ట నుంచి తెలంగాణకు వాటా ప్రకారం నీళ్లు రావడం లేదని, ఆనకట్ట ఎత్తు పెంచాలని ఇంజినీర్లు కోరారు. ఈ ఆనకట్ట మరోవైపు నుంచి నాలుగు టీఎంసీల నీటిని తీసుకునేలా ఏపీ కాలువ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసిందని, ఈ నేపథ్యంలో ఆనకట్టకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయకపోతే రెండు రాష్ట్రాలకు నష్టం వాటిల్లే అవకాశాలున్నాయని బోర్డు అధికారులు సూచించారు. దీంతో ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు కర్ణాటక అంగీకరించింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.