close
నాలుగు రోజులు ప్రత్యేక దర్శనం కోటా పెంపు: తితిదే

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి దర్శనానికి తిరుమలకు వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ఈ నెలలో నాలుగు రోజుల పాటు ప్రత్యేక ప్రవేశదర్శనం కోటా పెంచుతున్నట్లు తితిదే ప్రకటించింది. దీనిలోభాగంగా 12, 26 తేదీల్లో 65ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు 4 వేల టోకెన్‌లను జారీ చేస్తుంది. ఉదయం 10గంటలు, మధ్యా హ్నం 2, 3 గంటలకు స్లాట్‌ల వారీగా టోకెన్లను తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ఎదుట ఉన్న కౌంటర్‌లో అందజేస్తుంది. 13, 27 తేదీల్లో ఐదేళ్లలోపు చిన్నారులతో పాటు తల్లిదండ్రులను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం మార్గంలో దర్శనానికి అనుమతించనుంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.