close
తెలంగాణ న్యాయశాఖ కార్యదర్శిగా సంతోష్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ న్యాయశాఖ కార్యదర్శిగా ఎ.సంతోష్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా, సెషన్స్‌ న్యాయమూర్తి అయిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శిగా ఉన్నారు. న్యాయశాఖ కార్యదర్శిగా ఆయన ఏడాదిపాటు పదవిలో ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 1991లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా చేరిన ఆయన 2010లో జిల్లా, సెషన్స్‌ న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2010 నుంచి 2013 వరకు సిద్దిపేటలో ఆయన అదనపు జిల్లా న్యాయమూర్తిగా పని చేశారు. 2013 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో న్యాయశాఖ కార్యదర్శిగా పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 నుంచి 2017 వరకు న్యాయశాఖ కార్యదర్శిగా ఉన్నారు. గత డిసెంబరు నుంచి న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియమితులై కొనసాగుతున్నారు. మరోసారి ఆయన తాజాగా న్యాయశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.