close
యాదాద్రిలో మరో కనుమ దారి

రాష్ట్రానికే వన్నె తెచ్చేలా పునర్నిర్మిస్తున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మరో కనుమ దారి (ఘాట్‌ రోడ్డు) ఏర్పాటవుతోంది. దేశాధినేతలు, ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఈ దారి నిర్మాణాన్ని చేపట్టారు. వీవీఐపీల విడిది కోసం నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్‌ సూట్ల సముదాయ ప్రాంగణం నుంచి కొండపైకి వెళ్లే మార్గంలో నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఆలయ కొండకు ఉత్తరాన నిర్మిస్తున్న ఆ దారి ఆలయ సన్నిధిలోని అతిథి గృహానికి చేరుతుందని ‘యాడా’ అధికారులు తెలిపారు. వలయదారి నిర్మాణంతో పాటు ప్రత్యేక ఘాట్‌ నిర్మాణం పనులు చేపట్టారు. దీంతో కలిపి ఆలయ కనుమ దారుల సంఖ్య మూడుకు చేరుకుంది.

- న్యూస్‌టుడే, యాదగిరిగుట్ట

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.