
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: రైతుల పేరుతో కొందరు ఇతర రాష్ట్రాల వ్యాపారులు ధాన్యాన్ని ఇక్కడికి తీసుకువస్తున్నారని, అలాంటి వారి నుంచి ధాన్యం కొనుగోలు చేయవద్దని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్లను కోరారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యానికి పూర్తిస్థాయిలో చెక్ పెట్టాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ధాన్యం రాకుండా ఉండేందుకు చెక్‌పోస్టులను పటిష్ఠంగా అమలు చేయాలని సూచించారు. రాష్ట్ర రైతులకు నష్టం కలిగించే చర్యలను సహించేది లేదన్నారు. ధాన్యం కొనుగోలులో కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు పెట్టినట్లు సమాచారముందని, ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల నుంచి ధాన్యాన్ని విక్రయించేందుకు ఇక్కడికి వస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 3,406 కొనుగోలు కేంద్రాలకు గాను ఇప్పటి వరకు 1,447 కేంద్రాల ద్వారా 2.51 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కనీస మద్దతు ధరను అమలు చేయడంతోపాటు రైతులకు ఆన్లైన్ ద్వారా చెల్లింపులను చేస్తున్నట్లు శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర వార్తలు
దేవతార్చన

- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- కాల్చేస్తున్నా.. కూల్చలేకపోయారు!
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఆ నలుగురే శ్రీమంతులయ్యారు: రేవంత్
- ‘మా వస్తువులు మేమే డెలివరీ చేసుకుంటాం’
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!