
‘ఈనాడు’ కథనానికి స్పందించిన మంత్రి హరీశ్‌రావు
నిమ్స్‌కి తరలించి వైద్యమందించేలా అధికారుల చర్యలు
ఈనాడు, సంగారెడ్డి: రోడ్డు ప్రమాదం బారిన పడి అచేతన స్థితికి చేరిన రహేలకి మెరుగైన వైద్యం అందనుంది. మళ్లీ ఆమె మామూలు మనిషిగా మారే వరకు పూర్తి బాధ్యతను తీసుకొని చికిత్స అందేలా చూసేందుకు అంతా సిద్ధమైంది. ‘అమ్మకే అమ్మలై..’ శీర్షికన గురువారం ‘ఈనాడు’లో వచ్చిన కథనానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. వారి కుటుంబానికి అండగా నిలిచి అన్నివిధాలుగా ఆదుకుంటామని చెప్పారు. సంగారెడ్డికి చెందిన రహేల నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తలకు బలంగా దెబ్బ తగలడంతో జీవచ్ఛవంలా మారారు. చదువు మధ్యలోనే ఆపేసి ఆమెకు కుమార్తెలిద్దరూ సపర్యలు చేస్తున్నారు. ఆ కుటుంబ దీన స్థితి మంత్రిని కదిలించింది. రహేలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు ఆయన సూచించారు.
జిల్లా సంక్షేమాధికారి పద్మావతి, బాలల పరిరక్షణ అధికారి రత్నం, కంది మండల తహసీల్దారు సరస్వతి గురువారం రహేల ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శుక్రవారం ఆమెను నిమ్స్‌లో చేర్పించనున్నారు. వైద్య నిపుణులతో సంప్రదించి బాధితురాలు త్వరగా కోలుకునేలా చూస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. వారి కుటుంబ సభ్యులతో ఆయన వీడియోకాల్ ద్వారా మాట్లాడారు. కుమార్తెలు అనూష, వరమ్మ చదువుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. రహేల ఇంటికి వెళ్లిన అధికారులు తక్షణ సాయంగా వారికి రూ.10 వేల నగదు అందించారు. చికిత్స కోసం భూమి తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదని.. రహేల తండ్రి ఎల్లయ్యకు సూచించారు. అన్ని ఖర్చులనూ తామే భరిస్తామని భరోసా ఇచ్చారు.
రాష్ట్ర వార్తలు
దేవతార్చన

- ‘రూలర్’ కొత్త ట్రైలర్ చూశారా
- అలా అయితే విసుగొచ్చేస్తుందట!
- ‘కబీర్‌సింగ్’ సీన్లుఇబ్బంది పెట్టాయని తెలుసు!
- నా జీవితంలో గొప్ప విషయమిదే: రాహుల్ సిప్లిగంజ్
- రూ.3.5 కోట్లు ఫ్రిడ్జ్‌లో పెట్టి..!
- గ్లూటెన్ ఉంటే ఏంటి?
- బాలయ్య సినిమాలో విలన్‌గా శ్రీకాంత్..?
- ఈగల్ 2.0 రోబో టీచరమ్మ!
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా