close
మూడేళ్లలో తెలంగాణకు రూ. 95,710.15 కోట్లు

రాజ్యసభలో కేంద్రం వెల్లడి

తెలంగాణకు 2016-17, 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో రూ.95,710.15 కోట్లు బదలాయించినట్లు కేంద్రం పేర్కొంది. కేంద్ర ప్రాయోజిత పథకాలు(సీఎస్‌ఎస్‌), ప్రభుత్వ రంగ పథకాల (సీఎస్‌) రూపంలో ఈ నిధులు బదలాయించినట్లు కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు మంగళవారం రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

ఎకరానికి పదివేలు ఇవ్వండి: ఎంపీ
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇన్‌పుట్‌ రాయితీగా ఇస్తోందని.. కేంద్రం కూడా రూ.10 వేల చొప్పున ఇవ్వాలని తెరాస ఎంపీ రంజిత్‌రెడ్డి కోరారు. ఈ-నామ్‌తో అన్ని మండలాలను అనుసంధానం చేయాలన్నారు. దేశవ్యాప్తంగా 7 కోట్ల రైతులకు కేంద్రం రూ.6 వేల చొప్పున ఇస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి రూపాలా తెలిపారు. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశమని గుర్తుచేశారు.
* తెలంగాణలో వర్షాలతో నష్టపోయిన పత్తి రైతుల్ని ఆదుకోవాలని భాజపా ఎంపీ సోయం బాపురావు కేంద్రాన్ని కోరారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.