close
అధర్‌సిన్హాతో సింగపూర్‌ ప్రతినిధుల సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పర్యటనలో ఉన్న సింగపూర్‌ కాన్సుల్‌ జనరల్‌ పాంగ్‌కాక్‌ టియాన్‌ సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌సిన్హాతో సచివాలయంలో బుధవారం భేటీ అయ్యారు. తెలంగాణలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని ఈ సందర్భంగా సిన్హా తెలిపారు. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా త్వరలో సింగపూర్‌ ప్రతినిధులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ నిరోధానికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. సింగపూర్‌-తెలంగాణల మధ్య వాణిజ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తామని టియాన్‌ చెప్పారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.