
అమెరికా ఆంకాలజీ నెట్వర్క్ ప్రతిపాదన
ఈనాడు, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా 140 ఆసుపత్రులను నిర్వహిస్తున్న అమెరికా ఆంకాలజీ నెట్ వర్క్ సంస్థ హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి క్యాన్సర్ ఆసుపత్రి ఏర్పాటుకు ముందుకొచ్చింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిలతో సమావేశమై తమ ప్రతిపాదనలను వెల్లడించింది. ఇటీవల వినోద్‌కుమార్ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఈ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో సేవలు అందించాలని కోరారు. ఈ మేరకు అమెరికా ఆంకాలజీ నెట్ వర్క్ సీఈవో బ్రాడ్ ప్రింక్టిల్, సీవోవో స్కోన్ హార్జ్, వైద్యనిపుణులు రాకేష్ సెహగల్, ఉపేందర్ రావుల బృందం బుధవారం హైదరాబాద్‌కు వచ్చింది. ఈటల, వినోద్, జోషిలతో వారు సమావేశమయ్యారు. తమ సంస్థ 265 మంది వైద్యనిపుణులతో 140 క్యాన్సర్ నివారణ కేంద్రాలను నిర్వహిస్తోందని చెప్పారు. హైదరాబాద్‌లో అత్యుత్తమ సంస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. వారిని స్వాగతించిన ఈటల, వినోద్, జోషిలు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పూర్తి ప్రతిపాదనలతో వస్తే సీఎం కేసీఆర్‌తో సమావేశం ఏర్పాటుచేయిస్తామని ఈ సందర్భంగా వినోద్ వెల్లడించారు.
రాష్ట్ర వార్తలు
దేవతార్చన

- ఉతికి ఆరేశారు
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- దిశకు తల్లిదండ్రులతో సఖ్యత లేదేమో!
- గొల్లపూడి మారుతీరావు కన్నుమూత
- అసలు కాల్పులు అక్కడే జరిగాయా?
- పథకం ప్రకారమే బూటకపు ఎన్కౌంటర్
- వాంఖడేలో రికార్డుల మోత!
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఎన్‌కౌంటర్‌పై సుప్రీం విచారణ కమిషన్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్