close
త్వరలో మన నుడి- మన నది

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వెల్లడి

ఈనాడు, అమరావతి: మాతృభాషను, నదులను పరిరక్షించుకునే దిశగా ‘మన నుడి- మన నది’ కార్యక్రమానికి జనసేన శ్రీకారం చుడుతోందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మన భాషను, నదులను ఎలా కాపాడుకోవాలో విజ్ఞులతో చర్చించినట్లు ఆయన వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలను భాగస్వాములను చేసేలా త్వరలో ‘మన నుడి-మన నది’ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, వివరాలు త్వరలో వెల్లడిస్తామని పవన్‌ ప్రకటించారు.

పీఎంవో కనిపెట్టేస్తుంది జగన్‌రెడ్డీ..
మాతృభాష పరిరక్షణకు చేసిన చట్టాలను రాష్ట్రంలో పరభాషాభివృద్ధికి వాడేస్తున్నారని పవన్‌ ట్విటర్‌లో విమర్శించారు. ‘350ఏ అధికరణ అమలు నెపంతో తెలుగు కోసం డబ్బు తీసుకొని, ఆంగ్లం కోసం ఖర్చు పెడతారా? పీఎంవో కార్యాలయం కనిపెట్టేస్తుంది జగన్‌ రెడ్డీ’ అంటూ బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో 350ఏ అధికరణానికి సంబంధించి పేర్కొన్న నిబంధనల స్క్రీన్‌ షాట్‌ను ట్వీట్‌కు జతచేశారు.

 

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.