close
హైదరాబాద్‌ త్వరలోనే బెంగళూరును అధిగమిస్తుంది

సిలికాన్‌వ్యాలీ వ్యవస్థాపకుడు కన్వల్‌ రేఖి
టీహబ్‌లో కేటీఆర్‌తో భేటీ

ఈనాడు, హైదరాబాద్‌: పెట్టుబడుల్లో హైదరాబాద్‌ నగరం త్వరలో బెంగళూరును అధిగమిస్తుందని ప్రముఖ వెంచర్‌ క్యాపిటలిస్టు, అమెరికాలోని సిలికాన్‌వ్యాలీ వ్యవస్థాపకుల్లో ఒకరైన కన్వల్‌రేఖి అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లోని టీహబ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. వివిధ అంశాలపై వారు చర్చించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం, టీహబ్‌, వీహబ్‌ ఇతర ప్రాజెక్టుల గురించి కేటీఆర్‌ ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా కన్వల్‌ తెలంగాణ పురోగతిని, ప్రభుత్వ విధానాలను, టీహబ్‌ను ప్రశంసించారు. డైనమిక్‌ లీడర్‌ కేటీఆర్‌ దీనిని ప్రపంచస్థాయి సంస్థగా తీర్చిదిద్దారన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.