close

ప్రధానాంశాలు

యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు ముమ్మరం

వైటీడీఏ పాలక మండలి సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌, యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: ప్రపంచ ప్రఖ్యాతిగాంచేలా యాదాద్రి క్షేత్రంలో ఆధ్యాత్మిక వనరుల ఏర్పాటుకు సంబంధిత శాఖలన్నీ కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషి సూచించారు. గురువారం ఆయన అధ్యక్షతన యాదాద్రి దేవాలయ ప్రాధికార సంస్థ పాలకమండలి సమావేశం హైదరాబాద్‌లోని బీఆర్‌కే భవన్‌లో జరిగింది. నీటి వసతి, అటవీ, రహదారులు, విద్యుద్దీకరణ పనులను సమీక్షించారు. రాయిగిరి నుంచి యాదగిరిగుట్ట పట్టణం వరకు విద్యుత్‌ కాంతులు విరజిమ్మేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. శ్రీ సుదర్శన మహాయాగం నిర్వహణకు ఏర్పాట్లుచేయాలని ఆదేశించారు. వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, వైటీడీఏ ఉపాధ్యక్షుడు కిషన్‌ రావు, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనితారామచంద్రన్‌, ఆలయ ఈవో గీతారెడ్డి పాల్గొన్నారు. శిల్పారామం ప్రాజెక్టు అభివృద్ధి సంస్థ పాలకమండలి సమావేశాన్ని కూడా సీఎస్‌ నిర్వహించారు. హైదరాబాద్‌లోని శిల్పారామం అభివృద్ధి, జిల్లాల్లోనూ వాటి నిర్మాణాలపై చర్చించారు.

సీఎంతో సీఎస్‌ భేటీ
సీఎస్‌ ఎస్‌కే జోషి దంపతులు గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులను కలిశారు. త్వరలో జరగనున్న తమ కుమార్తె వివాహానికి సీఎస్‌ వారిని ఆహ్వానించారు.

2.35 లక్షల మందికి క్రిస్మస్‌ దుస్తుల పంపిణీ
ఈనాడు, హైదరాబాద్‌: క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 2.35 లక్షల మంది నిరుపేద క్రైస్తవులకు దుస్తులు, కానుకలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సయ్యద్‌ అక్బర్‌ హుస్సేన్‌ గురువారం వస్త్రాల నమూనాలను తమ కార్యాలయంలో పరిశీలించారు. అనంతరం వాటిని జిల్లాలకు తరలించే వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.