close

ప్రధానాంశాలు

శీతాకాల విడిదికి రాష్ట్రపతి కోవింద్‌

21న హైదరాబాద్‌కు రాక... 28న తిరుగుపయనం
రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కోసం తెలంగాణకు రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అందిన ప్రాథమిక సమాచారం మేరకు... ఈనెల 21 నుంచి 28వ తేదీ వరకు ఆయన హైదరాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఏటా రాష్ట్రపతి శీతాకాల విడిదికి రావడం ఆనవాయితీగా ఉంది. ఈనెల 21న ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకోనున్న ఆయన 22 నుంచి 26 వరకు కేరళలో పర్యటిస్తారని సమాచారం. 26న అక్కడి నుంచి ఆయన తిరిగి హైదరాబాద్‌కు వస్తారు. 27న నగరంలో ఉండి 28న దిల్లీకి పయనమవుతారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా రాజ్‌భవన్‌లో విందు, రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందును నిర్వహిస్తారు. రాష్ట్రపతి పర్యటనపై ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి పూర్తి స్థాయి అధికారిక సమాచారం రానుంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.