Huzurabad By-election: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం

ప్రధానాంశాలు

Huzurabad By-election: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం

కరీంనగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి ఎగ్జిట్‌పోల్‌ సర్వే నిర్వహించొద్దని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి ఆర్‌వీ.కర్ణన్‌ స్పష్టం చేశారు. వాటిపై నిషేధం విధించినట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం అక్టోబరు 30 రాత్రి 7.30 గంటల వరకు ఎగ్జిట్‌పోల్‌ నిర్వహించరాదని, ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాలో ప్రచురించరాదని, వాటిని ఇతర మాధ్యమాల్లోనూ ప్రచారం చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొందన్నారు. ఆదేశాలను అతిక్రమించి ఎగ్జిట్‌పోల్స్‌ నిర్వహించినా, మీడియాలో ప్రసారం చేసినా శిక్షార్హులవుతారన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని