బీఆర్క్‌ ప్రవేశాల ప్రక్రియ షురూ
close

ప్రధానాంశాలు

బీఆర్క్‌ ప్రవేశాల ప్రక్రియ షురూ

నవంబరు 17న తొలి విడత సీట్ల కేటాయింపు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయం(జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) ప్రాంగణం, దాని అనుబంధ కళాశాలల్లో అయిదేళ్ల బ్యాచులర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌(బీఆర్క్‌) కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ సోమవారం మొదలైంది. నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఆర్కిటెక్చర్‌(నాటా)లో ఉత్తీర్ణులైన వారు ఈ సీట్లకు పోటీపడతారు. కన్వీనర్‌ కోటా కింద 600 వరకు సీట్లుండగా సుమారు 1500 మంది వరకు దరఖాస్తు చేసుకుంటారని అంచనా. నాటాలో ఉత్తీర్ణులైన వారు నవంబరు 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత నాటా స్కోర్‌కు 50 శాతం, ఇంటర్‌ మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకు కేటాయిస్తారు. అనంతరం వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్న తర్వాత నవంబరు 17న సీట్లు కేటాయిస్తారు. రెండో విడత సీట్లను నవంబరు 24న కేటాయిస్తారు. డిసెంబరు 1 నుంచి తరగతులు మొదలవుతాయి. విశ్వవిద్యాలయం పదో షెడ్యూల్‌లో ఉన్నందున ప్రాంగణంలోని 64శాతం సీట్లను ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు కేటాయిస్తారు. పూర్తి వివరాలను www.barchadm.tsche.ac.in ద్వారా తెలుసుకోవచ్చు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని