ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాల్లో  12 రోజుల సమ్మె కాల వేతనం
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్టీసీ ఉద్యోగుల ఖాతాల్లో  12 రోజుల సమ్మె కాల వేతనం

ఈనాడు, హైదరాబాద్‌: సమ్మె కాలానికి సంబంధించి అపరిష్కృతంగా ఉన్న 12 రోజుల వేతనాన్ని టీఎస్‌ఆర్టీసీ శనివారం ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. గడిచిన ఏడాది అక్టోబరు నుంచి ఆర్టీసీలో 55 రోజుల పాటు నిరవధిక సమ్మె జరిగిన విషయం తెలిసిందే. సమ్మె విరమణ నేపథ్యంలో ఆ కాలానికి వేతనాన్ని చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇప్పటి వరకు రెండు దఫాలుగా 43 రోజుల వేతనాన్ని చెల్లించారు. మిగిలిన 12 రోజుల వేతనాన్ని తాజాగా జమ చేశారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు