
ప్రధానాంశాలు
ఈనాడు, దిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్తు ఉద్యోగుల కేటాయింపుపై సర్వోన్నత న్యాయస్థానంలో కొనసాగిన వాదనలు ముగిశాయి. తీర్పును రిజర్వు చేస్తున్నట్లు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం బుధవారం ప్రకటించింది. అభ్యంతరాలుంటే ఈనెల 27లోపు రాతపూర్వకంగా సమర్పించేందుకు వాదప్రతివాదులకు ధర్మాసనం అవకాశం ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్తు ఉద్యోగుల కేటాయింపుపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ ఇచ్చిన ముగింపు నివేదికను వ్యతిరేకిస్తూ తెలంగాణ విద్యుత్తు సంస్థలు, పలువురు ఏపీ ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. ఆర్థిక సమతుల్యత అంశాలు పరిగణించకుండానే ఉద్యోగులను తమ రాష్ట్రానికి అదనంగా కేటాయించారని తెలంగాణ విద్యుత్తు సంస్థల తరఫు న్యాయవాదులు గతంలో వాదనలు వినిపించారు. తెలంగాణ వాదనలు సరికాదని, అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకునే కేటాయింపులు చేసినట్లు బుధవారం ఏపీ విద్యుత్తు సంస్థల తరఫు న్యాయవాదులు వాదించారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కంగారూను పట్టలేక..
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- సస్పెన్స్‌కు తెరదించిన శతాబ్ది రాయ్
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?