close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
యూజీసీ ఉపసంఘం అధ్యక్షుడిగా ఇఫ్లూ వీసీ సురేష్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌ : జాతీయ విద్యా విధానం అమలు విధివిధానాలపై చర్చించేందుకు విశ్వవిద్యాలయ నిధుల సంఘం(యూజీసీ) ఏర్పాటు చేసిన ఉపసంఘం అధ్యక్షునిగా ఇఫ్లూ ఉపకులపతి ప్రొ.ఇ.సురేష్‌కుమార్‌ నియమితులయ్యారు. 2021-22 నుంచి జాతీయ విద్యావిధానం అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందుకు అవసరమైన సన్నద్ధతపై అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలతో సమీక్షించేందుకు వివిధ అంశాల వారీగా యూజీసీ ప్రత్యేకంగా ఉపసంఘాలను నియమించింది. ‘మల్టీ డిసిప్లినరీ-హోలిస్టిక్‌ లెర్నింగ్‌’ అనే అంశంపై ఏర్పాటైన కమిటీకి సురేష్‌కుమార్‌ నేతృత్వం వహిస్తున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు