
ప్రధానాంశాలు
డిసెంబరు నెలాఖరు వరకు ‘పండగ ప్రత్యేక’ రైళ్లు
ఈనాడు, హైదరాబాద్: ప్రత్యేక రైళ్లు, పండగ ప్రత్యేక రైళ్లను మరికొంత కాలం నడిపించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే బుధవారం ప్రకటించింది. 14 ప్రత్యేక రైళ్లు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. దసరా, దీపావళి రద్దీని దృష్టిలో పెట్టుకుని నడిపిస్తున్న 12 ‘పండగ ప్రత్యేక రైళ్ల’ను డిసెంబరు నెలాఖరు వరకు పొడిగించింది. అయ్యప్ప భక్తుల కోసం సికింద్రాబాద్-త్రివేండ్రం మధ్య రెండు రైళ్లను జనవరి 20 వరకు నడపాలని నిర్ణయించింది. ప్రత్యేక రైళ్ల సమయాలు డిసెంబరు 1 నుంచి మారుతున్నట్లు తెలిపింది.
పొడిగించిన ప్రత్యేక రైళ్లు
* హైదరాబాద్-విశాఖపట్నం-హైదరాబాద్ (నం.02728/02727), హైదరాబాద్-న్యూదిల్లీ-హైదరాబాద్ (నం.02723/02724), సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ (నం.02784/02783), లింగంపల్లి-కాకినాడ టౌన్-లింగంపల్లి (నం.02776/02775), తిరుపతి-విశాఖపట్నం-తిరుపతి (నం.02708/02707), హైదరాబాద్-ముంబయి-హైదరాబాద్ (నం.02702/02701), తిరుపతి-నిజామాబాద్-తిరుపతి (నం.02793/02792).
.. ఈ రైళ్లు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగింపు.
డిసెంబరు నెలాఖరు వరకు..
* తిరుపతి-లింగంపల్లి-తిరుపతి (నం.02733/02734), కాకినాడ పోర్ట్-లింగంపల్లి-కాకినాడ పోర్ట్ (నం.02737/02738), నర్సాపూర్-లింగంపల్లి-నర్సాపూర్ (నం.07255/07256), హైదరాబాద్-తాంబరం-హైదరాబాద్ (నం.02760/02759), హైదరాబాద్-ఔరంగాబాద్-హైదరాబాద్ (నం.07049/07050), తిరుపతి-అమరావతి-తిరుపతి (నం.02765/02766)
రైళ్లు డిసెంబరు 31 వరకు పొడిగింపు. కాచిగూడ-బెంగళూర్-మైసూర్ రైలును కూడా పొడిగించారు.
* సికింద్రాబాద్-త్రివేండ్రం సెంట్రల్-సికింద్రాబాద్ (నం.07230/07229) జనవరి 20 వరకు పొడిగించారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కంగారూను పట్టలేక..
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- సస్పెన్స్‌కు తెరదించిన శతాబ్ది రాయ్
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!