
ప్రధానాంశాలు
ఈనాడు, హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చి వరకు రేషన్‌కార్డుదారులకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు తెలంగాణ సర్కారుకు అధికారిక సమాచారం పంపింది. కరోనా తీవ్రతను నియంత్రించే క్రమంలో మార్చిలో లాక్డౌన్ విధించటంతో ఏప్రిల్ నుంచి ప్రతి వ్యక్తికి 12 కిలోల ఉచిత బియ్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించటం తెలిసిందే. అప్పటికే ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ 12 కిలోల చొప్పున పంపిణీ చేసింది. తరవాత నుంచి ఒక్కో వ్యక్తికి పది కిలోల చొప్పున అందజేసింది. నవంబరు కోటాతో ఉచిత బియ్యం పంపిణీ ముగిసిందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. తాజాగా 2021 మార్చి వరకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వశాఖ రాష్ట్రానికి వర్తమానం పంపింది.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కంగారూను పట్టలేక..
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- సస్పెన్స్‌కు తెరదించిన శతాబ్ది రాయ్
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?