close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తుంగభద్ర తీరం.. భక్తజన హారం

ఆరో రోజు పుష్కరాలకు 21,948 మంది హాజరు

నాగర్‌కర్నూల్‌, ఈనాడు డిజిటల్‌- అలంపూర్‌, న్యూస్‌టుడే: తుంగభద్ర పుష్కరాలకు భక్తులు తరలి వస్తున్నారు. నది స్నానాలు ఆచరించి భక్తిభావంతో మురిసిపోతున్నారు. ఆరో రోజు అయిన బుధవారం జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్‌, అయిజ, రాజోలి, వేణిసోంపూర్‌లో ఏర్పాటు చేసిన ఘాట్లలో 21,948 మంది పుష్కర స్నానాలు చేశారు. ఏకాదశి నేపథ్యంలో భక్తుల రద్దీ కొంత పెరిగినట్లు తెలుస్తోంది. డిసెంబరు 1వ తేదీతో పుష్కరాలు ముగియనున్న నేపథ్యంలో భక్తుల సంఖ్య మరింత పెరిగే సూచనలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు