close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తెలుగు రాష్ట్రాలకు ఐజీఎస్‌టీ బకాయిల విడుదల

2018 మార్చి వరకు లెక్కింపు

తెలంగాణకు రూ.2,638 కోట్లు, ఏపీకి రూ.1,261 కోట్లు

ఈనాడు, దిల్లీ: ఐజీఎస్‌టీ బకాయిలను విడుదల చేస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణకు రూ.2,638 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,261 కోట్ల మొత్తం దక్కనుంది. 2018 మార్చి 31 నాటికి ఐజీఎస్‌టీలో రాష్ట్రాలకు రావాల్సిన వాటాను లెక్కించి ఇప్పుడు విడుదల చేస్తున్నట్లు ఆర్థికశాఖ వెల్లడించింది. ఈ మొత్తాన్ని గ్రాంట్స్‌ రూపంలో అందజేస్తున్నట్లు పేర్కొంది. అక్టోబరు 5న జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో ఐజీఎస్‌టీ పాత బకాయిలపై చర్చ జరిగింది. ఆ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ.. ‘‘ఐజీఎస్‌టీ బకాయిల చెల్లింపు పెండింగ్‌ అంశం పరిష్కారం కోసం ఎప్పటి నుంచో కేంద్రం వేచిచూస్తోంది. ఐజీఎస్‌టీ సమస్యను వేగంగా పరిష్కరించడానికి రూ.1.65లక్షల కోట్లను రెండు భాగాలుగా విభజించి రూ.80వేల కోట్లను రాష్ట్రాలకు అందించింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఐజీఎస్‌టీ పంపిణీకి సంబంధించి అప్పట్లో అధికారిక సూత్రం లేకపోవడంతో ఆ నిర్ణయం తీసుకొని పంపిణీచేసింది. తర్వాతి కాలంలో అది ఎన్నో సమస్యలు సృష్టించింది. తక్కువ దక్కాల్సిన రాష్ట్రాలకు ఎక్కువ, ఎక్కువరావాల్సిన రాష్ట్రాలకు తక్కువ దక్కింది. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక పూర్తిగా దృష్టిసారించి సమస్యను పరిష్కరించాలని నిర్ణయించాం. ఇదివరకు రావాల్సిన దానికంటే తక్కువ వచ్చిన రాష్ట్రాలకు ఇప్పుడు చెల్లిస్తాం’’ అని ప్రకటించారు. అందులో భాగంగానే పాత బకాయిలను తెలుగురాష్ట్రాలకు ప్రస్తుతం అందజేస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు