
ప్రధానాంశాలు
ఈనాడు, హైదరాబాద్: తీరం దాటిన తుపాను బలహీనపడిందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు. బంగాళాఖాతం పశ్చిమ ప్రాంతంలో అల్పపీడనం ఉంది. దీనికి అనుబంధంగా 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. మరోవైపు హిందూ మహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న బంగాళాఖాతంలో అండమాన్ దీవుల వద్ద మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆదివారానికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. ఇది తీవ్ర వాయుగుండంగా మారి వచ్చే నెల 2 నాటికి తమిళనాడు, పుదుచ్చేరి తీరం వద్దకు వచ్చే అవకాశాలున్నాయి. తెలంగాణలో శనివారం అక్కడక్కడ ఒక మాదిరి వర్షాలు పడే అవకాశాలున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం రాత్రి వరకూ అక్కడక్కడ సాధారణ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ముత్తారం మహదేవపూర్(జయశంకర్ జిల్లా)లో 3.1 సెం.మీ., అశ్వారావుపేట, కొత్తగూడెం, బోనకాలు, సత్తుపల్లిలో 3 సెం.మీ. చొప్పున వర్షం కురిసింది. రాష్ట్రంలో చలి పెరిగింది.
ప్రధానాంశాలు
దేవతార్చన

- RRRపై సెటైర్.. స్పందించిన చిత్రబృందం
- రివ్యూ: అల్లుడు అదుర్స్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- పంత్ తీరుపై అంపైర్లు కలగజేసుకోవాలి
- 60 ఏళ్ల తర్వాత టీమ్ఇండియా 20 ఆటగాళ్లతో..
- వాయుసేన తలనొప్పికి తేజస్ మందు..!
- 75 డ్రోన్లు విరుచుకుపడి..!
- జో బైడెన్ కీలక ప్రతిపాదన
- లడ్డూ కావాలా..? పంచ్ ఇచ్చిన దిశాపటాని