close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రతి పౌరుడికీ టీకా

కేంద్ర లక్ష్యమన్న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్‌

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోని ప్రతి పౌరుడికి కరోనా టీకా అందించాలనేది కేంద్రం లక్ష్యంగా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. శుక్రవారం ది ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన వెబ్‌నార్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రాల భాగస్వామ్యంతో వ్యాక్సిన్‌, ఇతర మందుల తయారీకి పరిశోధనలు కొనసాగుతున్నాయన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు కేంద్రం ప్రణాళిక రూపొందించిందన్నారు. ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు రమాకాంత్‌ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు సఫలీకృతం కావాలంటే ప్రైవేటు హెల్త్‌కేర్‌ కంపెనీలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఏపీసీసీఐ అధ్యక్షుడు సీవీ అచ్యుతరావ్‌, హెచ్‌డీఎంసీ ఛైర్మన్‌ శేఖర్‌ అగర్వాల్‌ పాల్గొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు