
ప్రధానాంశాలు
నీటి పొదుపుతో పంటలు పండించినందుకు గుర్తింపు
ఈనాడు, హైదరాబాద్: సాగునీటి పొదుపుతో పంటలు పండించడంలో ఆదర్శంగా నిలిచినందుకు తెలుగు రైతుకు అంతర్జాతీయ పురస్కారం దక్కింది. దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సాగునీటి, డ్రైనేజీ కమిషన్(ఐసీఐడీ) అనే స్వచ్ఛంద సంస్థ జాతీయ పురస్కారాలను శుక్రవారం ప్రకటించింది. సాగునీటి రంగానికి చెందిన సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు సభ్యులుగా గల ఈ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తూ.. వ్యవసాయంలో నీటి నిర్వహణ, పొదుపుపై వర్షాధార ప్రాంతాల రైతులను ప్రోత్సహిస్తుంది. బిందు, తుంపర్ల సేద్యం ద్వారా ఎరువుల వినియోగంతో పంటలు పండిస్తూ అధిక దిగుబడులు సాధించినందుకు ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన మేకల శివశంకర్‌రెడ్డిని ఉత్తమ రైతుగా ఎంపిక చేసినట్లు ఐసీఐడీ ప్రకటించింది. ఆ సంస్థ మొత్తం 4 పురస్కారాలు ప్రకటించగా రైతు విభాగంలో మాత్రమే భారతదేశానికి పురస్కారం దక్కింది. మిగిలిన మూడు పురస్కారాలను ఇరాన్ దేశస్థులు దక్కించుకోవడం గమనార్హం. శివశంకర్‌రెడ్డి ప్రస్తుతం సాగునీటిని పొదుపుగా వినియోగిస్తూ దానిమ్మ, ద్రాక్ష పంటలు పండిస్తున్నారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- కల లాంటిది.. నిజమైనది
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- భలే పంత్ రోజు..
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- యువతిని హత్యచేసిన డిల్లీబాబు ఆత్మహత్య
- రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను!
- ప్రపంచమంతా సెల్యూట్ చేస్తోంది: రవిశాస్త్రి