close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఘనంగా గోదారంగనాథుల కల్యాణోత్సవం

భద్రాచలం, యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి, యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాల్లో బుధవారం గోదా రంగనాథుల కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా గత నెల 16 నుంచి తిరుప్పావై పర్వాన్ని పాశురాల పఠనంతో నిర్వహిస్తున్నారు. వేడుకల్లో కీలక ఘట్టమైన కల్యాణోత్సవాన్ని భద్రాచలంలో ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులు నేతృత్వంలో, యాదాద్రిలో బాలాలయ మండపంలో జరిపారు. నెల రోజుల పాటు గోదాదేవి తిరుప్పావై వ్రతం పాటించి రంగనాథుణ్ని భర్తగా పొందిన రోజు భోగి అని పండితులు ప్రవచించారు. భగవంతుణ్ని ప్రసన్నం చేసుకునేందుకు భక్తికి మించింది లేదని సుభాషించారు. వరుసగా సెలవులు రావడంతో ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం సంక్రాంతి వేడుకలు నిర్వహించేందుకు భద్రాద్రి ఆలయంలో ఏర్పాట్లు చేశారు. కనుమ సందర్భంగా శుక్రవారం ఆండాళ్‌ అమ్మవారికి తిరువీధి సేవ ఉంటుంది. యాదాద్రిలో గురువారం (మకర సంక్రాంతి) ఒడిబియ్యం క్రతువు జరుపతామని ప్రధాన పూజారి తెలిపారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు