close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తరలి వచ్చిన తరంగాలు

కే కుటుంబంలోని నాలుగు తరాల ప్రతినిధులు వారు. ఉపాధి రీత్యా ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. ఏటా సంక్రాంతికి అంతా ఒక్క చోటకు చేరడం ఆనవాయితీ. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో బుధవారం ఈ దృశ్యం చూడముచ్చట గొలిపింది. గ్రామానికి చెందిన దివంగత పోలీసు పటేల్‌ కుతుంబాక రామయ్య, బాపమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఏడుగురు కుమార్తెలు. వారి సంతానం, వారసులు వెరసి 140 మంది వరకు ఉన్నారు. కరోనా కారణంగా ఈసారి విదేశాల్లో ఉన్నవారు రాలేకపోయినా, స్వదేశంలో ఉన్నవారు తరలివచ్చారు. చిన్నపిల్లలకు భోగి పళ్లు పోయడం సహా పండుగ వేడుకలను సుమారు వందమంది కలిసి ఆనందంగా జరుపుకొన్నారు.

- రఘునాథపాలెం, న్యూస్‌టుడే


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు