close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సంక్రాంతి సంబురం.. తాకింది అంబరం

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుక

భోగి పండుగ వేళ... చార్మినార్‌ వద్ద సంబరాలు అంబరాన్ని తాకాయి. బుధవారం తెల్లవారుజామున తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి వేడుకలో జాగృతి ప్రతినిధులు, తెరాస నేతలు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలను ఆమె ఆసక్తిగా వీక్షించారు. అనంతరం చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేశారు. గుల్జార్‌హౌజ్‌ వద్ద కవిత మాట్లాడుతూ.. భోగి మంటల్లో కరోనా దహనమై.. సంక్రాంతి నుంచి జనం భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షించారు. తెరాస యువజన విభాగం నాయకుడు పోలోజు సంతోష్‌కుమార్‌.. కవితకు అందజేసిన గులాబీ రంగు పతంగి జనాన్ని ఆకట్టుకుంది.

- చార్మినార్‌, న్యూస్‌టుడే


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు