
ప్రధానాంశాలు
కర్వెన, ఉదండాపూర్ జలాశయాల మధ్య ఏర్పాటు
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రకటన
జాతీయ పారా మోటార్ ఛాంపియన్షిప్ -2021 ప్రారంభం
మహబూబ్‌నగర్, ఈనాడు డిజిటల్: దేశంలోనే మొట్టమొదటి వైమానిక క్రీడా శిక్షణ కేంద్రాన్ని మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రకటించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కర్వెన, ఉదండాపూర్ జలాశయాల మధ్య 15 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేస్తామన్నారు. మహబూబ్‌నగర్‌లోని స్టేడియం మైదానంలో జాతీయ పారా మోటార్ ఛాంపియన్షిప్- 2021 పోటీలను బుధవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. ఈనెల 17 వరకు ఈ పోటీలు కొనసాగుతాయని వెల్లడించారు. మెట్రో నగరాలకే పరిమితమైన పారా మోటార్ పోటీలు తొలిసారిగా ఓ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. జిల్లా కలెక్టరు ఎస్.వెంకట్రావు, వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోటీలకు మొత్తం 10 రాష్ట్రాల నుంచి 11 మంది రైడర్లు హాజరయ్యారు. వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఛాంపియన్‌షిప్‌లో డబుల్, సింగిల్ రైడ్ విభాగాల్లో పోటీలు ఉంటాయి. వీటిలో ప్రథమ, ద్వితీయ స్థానాలను గెలుచుకున్న విజేతలు ఈ ఏడాది ఈజిప్టులో జరిగే అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధిస్తారు. సంక్రాంతి నేపథ్యంలో పోటీలతో పాటు ప్రేక్షకుల ఆహ్లాదం కోసం రైడర్లు స్కై డైవింగ్ విన్యాసాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. రుసుం చెల్లించి జాయ్ రైడ్ చేసే అవకాశం ఔత్సాహికులకు కల్పించారు. రిమోట్ ద్వారా చిన్న పారా మోటార్లతో గాలిలో విన్యాసాలు చేయిస్తున్నారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- 2-1 కాదు 2-0!
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడితడే!
- ఇక చాలు
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
- శంషాబాద్‌లో సిరాజ్‌కు ఘన స్వాగతం..