
ప్రధానాంశాలు
శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన డీజీపీ
ఈనాడు, హైదరాబాద్: సైబర్ నేరాల నిరోధానికి దేశంలోనే మొదటిసారి రాష్ట్ర పోలీసు శాఖలో సైబర్ వారియర్లను నియమించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇద్దరు, పట్టణ ప్రాంతాల్లో ముగ్గురు, కమిషనరేట్ల పరిధిలో ఐదుగురు చొప్పున ప్రతి పోలీస్‌స్టేషన్‌లో వీరు అందుబాటులో ఉంటారు. వీరికి వారం రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని డీజీపీ మహేందర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లలో పనిచేసేందుకు 1988 మంది పోలీసులను సైబర్ వారియర్లుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. సైబర్ నేరాలను గుర్తించడం, దర్యాప్తు చేయడం, ప్రజలను చైతన్య పరచడం వంటి అంశాల్లో వారియర్లకు శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ‘‘ఠాణాలో సిబ్బంది విధి నిర్వహణకు 17 మార్గదర్శకాలు అమలు చేస్తున్నాం. ఇకపై సైబర్ నేరాల నిరోధం 18వ మార్గదర్శకంగా ఉంటుంది. వారియర్లు స్టేషన్ సిబ్బందికి తోడ్పాటు అందిస్తారు. ప్రస్తుత ఏడాదిని సైబర్ భద్రతా సంవత్సరంగా ప్రకటించాం. ఇందుకోసం రూపొందించిన విభాగానికి ఐజీ రాజేష్‌కుమార్‌ను ప్రత్యేక అధికారిగా నియమించాం’’ అని మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సైబర్ వారియర్స్ అనే పుస్తకాన్ని డీజీపీ ఆవిష్కరించారు. సీఐడీ అదనపు డీజీ గోవింద్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ఆఫర్ కోసం చిరు, పవన్‌లకు కాల్ చేశా: కోట
- పిచ్చి..పిచ్చి రాతలు రాయకండి: అషూరెడ్డి
- రెండో పెళ్లిపై మంచు మనోజ్ ట్వీట్
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్‌కి ముందే తెలుసు
- బుమ్రాతో పెళ్లిపై అనుపమ కుటుంబ సభ్యుల క్లారిటీ
- నాలుగో అంతస్తు నుంచి పడి ముత్తూట్ ఛైర్మన్ మృతి
- ఫొటోలో చూసినట్లు వరుడు లేడని పెళ్లికి నిరాకరణ
- వాళ్లను కొట్టి.. వాళ్లింటికి
- అంబానీ గ్యారేజ్‌లో చేరిన కొత్త కారిదే..!
- తొలి ట్వీట్‌కు రూ.18.30 కోట్లు!