
ప్రధానాంశాలు
ఎత్తయిన చెట్టు... ఎండి మోడువారింది. బలహీనమైన కొమ్మలు.. అలాంటి ఓ కొమ్మపై కాలేస్తేనే పుటుక్కుమంటూ విరిగిపోవటం ఖాయం.. కానీ, ఈ చిరుతను చూశారా? లాఘవంగా చెట్టు చివరికంటూ ఎక్కేసింది. అక్కడే ఓ కొమ్మపై ఒదిగి కూర్చుంది. ములుగు జిల్లా వాజేడు మండల సమీప కొంగాల అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం కలకలం సృష్టించిందీ దృశ్యం.. కొండముచ్చుల వింత అరుపులతో అటుగా వెళ్లిన గ్రామస్థులకు ఆలిచెట్టు చివరి కొమ్మలపై కూర్చున్న చిరుత కన్పించింది. భయంతో వారు గట్టిగా కేకలు వేయడంతో చెట్టుదిగి తుర్రున అడవిలోకి పారిపోయింది. ఈ చిత్రాలను సెల్ఫోన్లలో బంధించిన యువకులు వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్ అయ్యాయి. కొంగాల అటవీప్రాంతంలో చిరుత సంచారం నిజమేనని దూలాపురం అటవీక్షేత్రాధికారి అనంతరామిరెడ్డి ధ్రువీకరించారు. దానికి మూడు, నాలుగేళ్ల వయసు ఉంటుందన్నారు. మాసంలొద్ది, దుసాపాటిలొద్ది జలపాతం సమీప నీటిగుంతల్లో దాహం తీర్చుకునే జంతువులను వేటాడేందుకు వచ్చి ఉంటుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
- న్యూస్‌టుడే, వాజేడు
ప్రధానాంశాలు
దేవతార్చన

- ఆఫర్ కోసం చిరు, పవన్‌లకు కాల్ చేశా: కోట
- పిచ్చి..పిచ్చి రాతలు రాయకండి: అషూరెడ్డి
- ఆ సినిమా ఫ్లాప్..నితిన్‌కి ముందే తెలుసు
- రెండో పెళ్లిపై మంచు మనోజ్ ట్వీట్
- బుమ్రాతో పెళ్లిపై అనుపమ కుటుంబ సభ్యుల క్లారిటీ
- నాలుగో అంతస్తు నుంచి పడి ముత్తూట్ ఛైర్మన్ మృతి
- ఫొటోలో చూసినట్లు వరుడు లేడని పెళ్లికి నిరాకరణ
- వాళ్లను కొట్టి.. వాళ్లింటికి
- అంబానీ గ్యారేజ్‌లో చేరిన కొత్త కారిదే..!
- తొలి ట్వీట్‌కు రూ.18.30 కోట్లు!