close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
28న యాదాద్రికి సీఎం కేసీఆర్‌ రాక

అదే రోజు ఆలయ ప్రారంభ తేదీ ఖరారు!

యాదగిరిగుట్ట, యాదగిరిగుట్ట అర్బన్‌, న్యూస్‌టుడే: యాదాద్రి శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవస్థానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 28న సందర్శించనున్నారు. పనుల పూర్తికి ఇంకా ఎంత సమయం పడుతుందో ఈ సందర్భంగా సీఎం చర్చిస్తారని వైటీడీఏ అధికారులు మంగళవారం తెలిపారు. అనంతరం చిన్న జీయర్‌స్వామి వద్దకు వెళ్లి ఆలయ ప్రారంభ తేదీని ఖరారు చేస్తారని పేర్కొన్నారు.

ఘనంగా భీష్మ ఏకాదశి వేడుకలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో మంగళవారం భీష్మ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖమండపంలో శ్రీస్వామి, అమ్మవార్లను ఆరాధిస్తూ లక్ష పుష్పాలతో అర్చన చేశారు.

శ్రీస్వామి హుండీ ఆదాయం రూ.95.24 లక్షలు

శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి బాలాలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన నగదు, నగల కానుకలను మంగళవారం లెక్కించారు. నగదు రూ.95,24,587, బంగారం 185 గ్రాములు, వెండి 2600 గ్రాములు వచ్చినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు