
ప్రధానాంశాలు
నేటి నుంచి చిన్న జాతర
4రోజులపాటు నిర్వహణ
ఈనాడు, వరంగల్, తాడ్వాయి, న్యూస్‌టుడే: సమ్మక్క, సారలమ్మలు తరలొచ్చే వేళైంది. వనాలు మళ్లీ జనాలతో సందడిగా మారే సమయం ఆసన్నమైంది. భక్తులు పారవశ్యంతో తన్మయం పొందే గడియ రానే వచ్చింది. మేడారం చిన్న జాతర బుధవారం నుంచి అంగరంగవైభవంగా ప్రారంభం కానుంది. నాలుగు రోజులపాటు జాతర నిర్వహించేందుకు ములుగు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. మహాజాతర తర్వాత ఏడాదికి మండమెలిగే పండగ(చిన్నజాతర)ను నిర్వహిస్తుంటారు. గతంలో ఈ పండగను పూజారులు, వారి కుటుంబసభ్యులు మాత్రమే నిర్వహించుకునేవారు. భక్తులు తరలివస్తుండటంతో ఈ పండగకు 2007 నుంచి అధికారులు, పూజారులు చిన్న జాతరగా నామకరణం చేసి నిరాటంకంగా నిర్వహిస్తున్నారు.
అయిదు లక్షల మంది వస్తారని అంచనా
గతేడాది మహాజాతర తర్వాత అనేక నెలలపాటు తల్లుల దర్శనాలకు అనుమతించకపోవడంతో దర్శనం కోసం ఎదురుచూస్తున్న వారంతా ఇప్పుడు మేడారానికి తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. నాలుగు రోజుల్లో సుమారు 5 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవార్లకు పూలు, పండ్లు, బంగారం(బెల్లం), పసుపు, కుంకుమలతో మొక్కులు సమర్పించేలా సౌకర్యాలు కల్పించినట్టు జాతర నిర్వాహకులు వెల్లడించారు. 500 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో ఉన్నట్టు, 200 మంది కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నట్టు, వైద్యశిబిరాలు కొనసాగుతున్నట్టు జిల్లా యంత్రాంగం వెల్లడించింది. హన్మకొండ, ములుగు, భూపాలపల్లి నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని, భక్తుల విడిది కోసం 5 షెడ్లను నిర్మించామని అధికారులు తెలిపారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- పాపం ప్రియ.. షారుఖ్ తనయ..
- 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
- పెళ్లిపై స్పందించిన విశాల్
- రేపు భారత్ బంద్
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- పిచ్‌తో కాదు బ్యాటింగ్ వల్లే 2 రోజులు: కోహ్లీ
- స్టార్స్‌తో శ్రీముఖి.. ఫొటోలు వైరల్
- భారత్‌కే ‘ఫైనల్’ అవకాశం: ఇంగ్లాండ్ ఎలిమినేట్
- ఆక్సిజన్ కొరత..ఆఫ్రికా, లాటిన్ దేశాలు విలవిల!
- రెండు రోజుల సంబరం.. కోహ్లీసేన అంబరం