
ప్రధానాంశాలు
ఈనాడు, హైదరాబాద్: ‘‘తెలంగాణ ఏర్పాటుకు పూర్వం కన్నీరొలికిన చోటే నేడు గంగ పరవళ్లు తొక్కింది. ఆనంద భాష్పాలు కురిపించింది’’ అని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు ట్వీట్ చేశారు. మధ్య మానేరు నుంచి వచ్చిన కాళేశ్వరం నీటితో నిండిన ముస్తాబాద్ చెరువు ఫొటోలను జత చేస్తూ..‘నిండు వేసవిలోనూ జల సంబురమిది’ అని పేర్కొన్నారు. టీహబ్ సాయంతో అంకుర సంస్థ రూపొందించిన వైద్యుల ఉచిత యాప్ ‘క్యూరిడాక్.కామ్’ కరోనా సమయంలో ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. వైద్యుల వద్దకు వెళ్లకుండానే ఉచిత సలహాలను ఇస్తుందని చెప్పారు. ఈ యాప్‌ను రూపొందించిన ఎం.ప్రహ్లాద్ బృందాన్ని ఆయన అభినందించారు. టీహబ్‌ను మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌లు సందర్శించారు. వ్యవసాయానికి అక్కరకొచ్చే, రైతులకు, కులవృత్తుల వారికి చేయూతనిచ్చే ఆవిష్కరణలు చేపట్టాలని సూచించారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత
- ఆ పాత్రలకు.. ఎవరు సరిపోతారా..!
- కొవిడ్.. కొత్తగా!
- WhatsApp: ఈ ‘పింక్’ లింక్ మీకూ వచ్చిందా?
- Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
- social look: అషు ప్రార్థన.. అఖిల్ కొత్తగా..
- విరాళంగా వచ్చిన 15వేల చెక్కులు బౌన్స్!
- ఉదయాన్నే మజ్జిగ తాగండి..
- నీ ఆశలన్నీ.. నా శ్వాసలోనే
- చివరిసారి సంతోషంగా ఉన్నది అప్పుడే: ధోనీ