close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొవిడ్‌లోనూ వ్యవసాయ రంగం వృద్ధి

ఉద్యాన వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్‌ తమిళిసై

రాజేంద్రనగర్‌, న్యూస్‌టుడే: కొవిడ్‌ ప్రభావంతో దేశంలో అన్ని రంగాలు కుదేలు కాగా.. సాగురంగం మాత్రం 3.4 శాతం వృద్ధి సాధించిందని, రైతుల కృషితోనే అది సాధ్యమైందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవాన్ని రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో బుధవారం నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనల నేపథ్యంలో పతకాలు సాధించిన విద్యార్థులను మాత్రమే ఆహ్వానించి వారికి ప్రదానం చేశారు. మిగిలిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో స్నాతకోత్సవాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. గవర్నర్‌ దృశ్యమాధ్యమం ద్వారా పుదుచ్చేరి నుంచి పాల్గొని ప్రసంగించారు. దేశంలో పోషకాహార లోపాన్ని తగ్గించడానికి అధిక పోషకాలున్న దేశీయ సంప్రదాయ కూరగాయలు, పండ్లలో నూతన రకాలను సృష్టించాల్సిన అవసరం ఉందని ఆమె శాస్త్రవేత్తలకు సూచించారు. కార్యక్రమంలో భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ త్రిలోచన్‌ మహాపాత్ర ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ఉపకులపతి నీరజా ప్రభాకర్‌ బంగారు పతకాలు అందించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు