
ప్రధానాంశాలు
శిక్ష పడినా అప్పీలు చేసుకోవచ్చనే ధీమా
ధిక్కరణ కేసుల్లో హైకోర్టు వ్యాఖ్య
ఈనాడు, హైదరాబాద్: న్యాయస్థానం ఉత్తర్వులను అమలు చేయడమంటే అధికారులకు లెక్కలేదని, కోర్టు ధిక్కరణ కింద శిక్ష పడినా అప్పీలు చేసుకోవచ్చనే ధీమా వ్యక్తమవుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇదే మాదిరి అప్పీలు దాఖలు చేసిన సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీవో ఎస్.శ్రీను, ఎమ్మార్వో ఉమాదేవిలపై ఉన్న ధిక్కరణ కేసుల వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. పాస్ పుస్తకాలను జారీ చేయాలని ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో ఈ అధికారులకు రెండు నెలల జైలు శిక్ష, 2 వేల జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి గత ఏడాది తీర్పు వెలువరించారు. వీటిపై అధికారులు దాఖలు చేసిన అప్పీళ్లపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గతంలో క్షమాపణ చెప్పకుండా అఫిడవిట్ దాఖలు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ మేరకు మార్పులతో అధికారులు అఫిడవిట్ వేశారు. కోర్టు ఉత్తర్వులు ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. తహసీల్దార్ బదిలీపై వెళ్లారని సాంకేతిక సమస్య వల్ల జాప్యం జరిగిందని, వెంటనే జారీ చేస్తామని అధికారుల తరఫు న్యాయవాది చెప్పగా తదుపరి విచారణను జూన్ 16వ తేదీకి వాయిదా వేసింది.
అనాథాశ్రమ విద్యార్థులతో గడపండి: నల్గొండ కలెక్టర్‌కు ఆదేశం
కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కొంటున్న నల్గొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆరు నెలలపాటు వారాంతాల్లో అనాథాశ్రమంలోని విద్యార్థులతో రెండు గంటలు గడపాలని హైకోర్టు ఆదేశించింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో పరమేశ్వర్ బిన్నీ రైస్‌మిల్లును బ్లాక్ లిస్ట్ నుంచి తప్పించి ధాన్యం సరఫరా చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంతో నాడు అక్కడ జాయింట్ కలెక్టర్‌గా ఉన్న ఆయనకు న్యాయస్థానం రూ.2 వేలు జరిమానా విధించింది. ఈ అప్పీలుపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. సామాజిక సేవ చేసి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తే శిక్షను రద్దు చేస్తామని గతంలో ఆదేశాలు జారీ చేయగా మిర్యాలగూడలో 600 మంది విద్యార్థినులను పాఠశాలల్లో చేర్పించడానికి కృషి చేశారని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అది ఆయన విధుల్లో భాగమని ధర్మాసనం తెలిపింది. నల్గొండ జిల్లాలో ఉన్న వసతి గృహంలో పిల్లలతో గడపాలని ఆదేశించింది. ఇదే కేసులో జిల్లా పౌరసరఫరాల అధికారి సంధ్యారాణి తన నివాస సమీపంలోని అనాథాశ్రమంలో ఉగాది, శ్రీరామనవమి పర్వదినాల్లో భోజనాలు పెట్టాలని ఆదేశించింది.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత
- ఆ పాత్రలకు.. ఎవరు సరిపోతారా..!
- కొవిడ్.. కొత్తగా!
- Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
- WhatsApp: ఈ ‘పింక్’ లింక్ మీకూ వచ్చిందా?
- social look: అషు ప్రార్థన.. అఖిల్ కొత్తగా..
- విరాళంగా వచ్చిన 15వేల చెక్కులు బౌన్స్!
- ఉదయాన్నే మజ్జిగ తాగండి..
- నీ ఆశలన్నీ.. నా శ్వాసలోనే
- చివరిసారి సంతోషంగా ఉన్నది అప్పుడే: ధోనీ