
ప్రధానాంశాలు
ఈనాడు, దిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవ తీసుకోవడంతో నెల్లూరులోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని యథాతథంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని సేవలను నిలిపేస్తున్నారంటూ పత్రికల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి కేంద్ర విద్యాశాఖ కార్యదర్శితో ఫోన్లో మాట్లాడారు. సేవల నిలిపివేత నిర్ణయంపై పునరాలోచించాలని సూచించారు. అందుకు విద్యాశాఖ కార్యదర్శి స్పందిస్తూ... మైసూరు ప్రాచీన భాషల విశిష్ట అధ్యయనం కేంద్ర సంచాలకులు పొరపాటున తన పరిధిలో ఈ నిర్ణయం తీసుకున్నారని, కేంద్ర విద్యాశాఖకు తెలియదని ఉపరాష్ట్రపతికి వివరించారు. తక్షణం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించి ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం సేవలు నెల్లూరు నుంచే కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా పాత ఉత్తర్వులను రద్దు చేస్తూ కొత్త సర్క్యులర్‌ను జారీ చేశారు. ఆ ప్రతులను ఉపరాష్ట్రపతి సచివాలయానికి పంపారు.
ప్రధానాంశాలు
దేవతార్చన

- ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత
- ఆ పాత్రలకు.. ఎవరు సరిపోతారా..!
- కొవిడ్.. కొత్తగా!
- Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
- WhatsApp: ఈ ‘పింక్’ లింక్ మీకూ వచ్చిందా?
- social look: అషు ప్రార్థన.. అఖిల్ కొత్తగా..
- విరాళంగా వచ్చిన 15వేల చెక్కులు బౌన్స్!
- ఉదయాన్నే మజ్జిగ తాగండి..
- నీ ఆశలన్నీ.. నా శ్వాసలోనే
- చివరిసారి సంతోషంగా ఉన్నది అప్పుడే: ధోనీ