close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
కొండగట్టుకు హెలిప్యాడ్‌ మంజూరు

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం హెలిప్యాడ్‌ను మంజూరు చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఇక భక్తులకు హెలికాప్టర్‌ ద్వారా రాకపోకల సౌకర్యం కలగనుందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో కవిత విలేకరులతో మాట్లాడారు. దేవస్థానం ఆవరణలో రూ.90 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీరామకోటి స్తూపం పనులు జూన్‌ 4న హనుమాన్‌ జయంతి నాటికి పూర్తవుతాయని తెలిపారు. 60 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌, 60 తాత్కాలిక స్నానశాలలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. 200 మంది వాలంటీర్లు త్వరలో కొండగట్టుపై అందుబాటులో ఉంటారన్నారు. జూన్‌ 4న 11 కోట్ల శ్రీరామ నామ పుస్తకాలను అంజన్నకు సమర్పించనున్నామని కవిత తెలిపారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు