close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
అర్హులందరికీ టీకాలందేలా కృషి

రెడ్‌క్రాస్‌ విభాగాలకు గవర్నర్‌ తమిళిసై సూచన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో అర్హులైన వారందరికీ టీకాలందేలా కృషి చేయాలని గవర్నర్‌ తమిళిసై రెడ్‌క్రాస్‌ సొసైటీ విభాగాలకు సూచించారు. సొసైటీ కార్యకలాపాలను విస్తృతం చేయాలని, వాలంటీర్ల సంఖ్యను పెంచుకోవాలని చెప్పారు. పుదుచ్చేరి నుంచి ఆమె శుక్రవారం తెలంగాణ రెడ్‌క్రాస్‌ సొసైటీ 33 విభాగాల ప్రతినిధులతో దృశ్య మాధ్యమంలో మాట్లాడారు. జిల్లా విభాగాలు చురుగ్గా పనిచేయాలని, అవసరమైన వారికి చేయూతనివ్వాలని అన్నారు. గిరిజనులతో పాటు మురికివాడల ప్రజలు, ఇతర వర్గాలకు టీకాలు చేరవేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
ఆర్థిక సాయం
రాష్ట్ర రెడ్‌క్రాస్‌ విభాగం అధ్యక్షురాలైన గవర్నర్‌ ఈ సందర్భంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి, వరంగల్‌ నగర విభాగాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇతర జిల్లాలకు రూ. 50 వేల చొప్పున ఇస్తామన్నారు. ఈ మొత్తాన్ని టీకాల రవాణాకు ఉపయోగించాలన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు