close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘10 రోజుల్లో రామగుండంలో ఆక్సిజన్‌ ప్లాంటు’

ఈనాడు, హైదరాబాద్‌: రామగుండం ఏరియా ఆసుపత్రిలో ఒక ఆక్సిజన్‌ ప్లాంటును పదిరోజుల్లో నెలకొల్పి ఉత్పత్తి ప్రారంభించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ మంగళవారం ఆదేశించారు. ఈ విషయంలో డైరక్టర్‌ బలరాం చొరవ చూపాలని చెప్పారు. కొవిడ్‌ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో సింగరేణి ఏరియా ఆసుపత్రులలో ఏ మాత్రం ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలన్నారు. ఇందుకోసం సింగరేణి సంస్థ స్వయంగా ఆక్సిజన్‌ ప్లాంటును చేపట్టాలన్నారు. ఇది ప్రారంభమయ్యేలోపు పాల్వంచ, ఇతర చోట్ల గల ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాల నుంచి కొనుగోలు చేయాలని సూచించారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు