close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
శ్మశానాలకు ఉచితంగా వెయ్యి టన్నుల కలప

ఎఫ్‌డీసీ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా మృతుల దహనానికి శ్మశానాల్లో కట్టెల కొరత నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌- ఎఫ్‌డీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలో ఉన్న వెయ్యి టన్నుల కలపను ఉచితంగా అందించనున్నట్లు ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి మంగళవారం ప్రకటించారు. ఈ సంస్థ ఏటా పెద్దమొత్తంలో ప్లాంటేషన్‌ చేపడుతుంది. దీని నుంచి వచ్చే కలపను పేపర్‌ మిల్లులకు విక్రయించగా ప్రస్తుతం సంస్థ వద్ద వెయ్యి టన్నుల కలప ఉంది. దీన్ని హైదరాబాద్‌తో పాటు సమీప మున్సిపాలిటీల్లోని శ్మశానాలకు ఇస్తామని ఎఫ్‌డీసీ వైస్‌ఛైర్మన్‌, ఎండీ జి.చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. అంత్యక్రియలకు అవసరమైన వెదురునూ సరఫరా చేస్తామన్నారు. హైదరాబాద్‌ పరిధిలోని అంబర్‌పేట, బన్సీలాల్‌పేట, ఆసిఫ్‌నగర్‌, ఈఎస్‌ఐ శ్మశానాలకు ఈ వారంలోనే కలప తరలించాలని ఎఫ్‌డీసీ నిర్ణయించింది. కలప రవాణాకు స్థానిక లారీ అసోసియేషన్‌ వర్గాలు ముందుకు వచ్చినట్లు చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు