close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఉదయం తండ్రి.. రాత్రి కుమారుడు మృతి

వేములవాడ గ్రామీణం, న్యూస్‌టుడే: కరోనా మహమ్మారికి తండ్రి, కుమారుడు బలైన హృదయవిదారక సంఘటన మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. వేములవాడ పట్టణానికి చెందిన గుమ్మడి ప్రకాశ్‌ (45), మధురిమ దంపతులకు అభయ్‌, అభిజిత్‌ అనే ఇద్దరు కవల పిల్లలున్నారు. ప్రకాశ్‌ వేములవాడలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపించడంతో మూడు రోజుల క్రితం వీరంతా పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ పాజిటివ్‌ వచ్చింది. ప్రకాశ్‌ కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఆయన మృతి చెందారు. మిగతా ముగ్గురు సిరిసిల్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో అభిజిత్‌ (18) మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఒకే రోజు తండ్రి, కుమారుడు మృతి చెందడం ఆ కుటుంబంలో పెను విషాదం నింపింది.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు