close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
12 గంటల వ్యవధిలోనే తండ్రి, కుమారుడి విషాదాంతం

సుల్తానాబాద్‌, న్యూస్‌టుడే: కరోనా బారిన పడిన తండ్రి, కుమారుడు 12 గంటల వ్యవధిలోనే అసువులు బాసిన ఘటన విషాదం నింపింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కదంబాపూర్‌కు చెందిన మానుపాటి కొమురయ్య(60) పదేళ్ల కిందట సుల్తానాబాద్‌లో స్థిరపడ్డారు. ఆర్టీసీ మెకానిక్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన ఆయనకు భార్య, కుమారుడు కిషన్‌(30), కుమార్తె ఉన్నారు. కిషన్‌ కరీంనగర్‌లోని ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ కుటుంబంతో అక్కడే నివాసం ఉంటున్నారు. 12 రోజుల కిందట కరోనా బారిన పడిన ఆయన సుల్తానాబాద్‌లోని ఇంటికి వచ్చి హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. గత శనివారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారు. కిషన్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తండ్రి కొమురయ్యకూ కరోనా సోకడంతో హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఉదయం ఆయన పరిస్థితి విషమించింది. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు