close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నేడూ రేపూ వడగళ్ల వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: విదర్భ నుంచి తెలంగాణ మీదుగా కేరళ వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నందున ఉష్ణోగ్రత సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీలు తక్కువగా నమోదవుతోంది. గాలిలో తేమ సాధారణం కన్నా 18 శాతం పెరిగింది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకూ 109 ప్రాంతాల్లో ఒక మాదిరి వర్షాలు కురిశాయి. అత్యధికంగా నాయుడుపేట (భద్రాద్రి జిల్లా)లో 4, కొత్తమోల్గర (మహబూబ్‌నగర్‌)లో 3.4, వనపర్తిలో 2.3, ఎల్‌బీనగర్‌ (హైదరాబాద్‌)లో 1.3, ఆల్వాల్‌లో 1.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలతో పలుచోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. బయట ఆరబోసిన ధాన్యం తడిసిపోయాయి.


ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు